తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శాసనసభలో శ్వేత పత్రంను విడుదల చేసిన ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి….
మిర్యాలగూడ ప్రజాలహరి… గత పది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం పాలించిన ప్రభుత్వాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కురుకపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో శ్వేత పత్రం విడుదలపై మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల దిబ్బగా మార్చారని కాలేశ్వరాన్ని ప్రాజెక్టుని సక్రమంగా నిర్మించలేకపోయిన ఘనత కేసిఆర్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మొత్తం రాష్ట్రాన్ని అప్పుల లో నెట్టేసారని విమర్శించారు. 9 సంవత్సరాల పాటు కేసీఆర్ కుటుంబం దగ్గరలో ఉంచుకున్నారని ప్రజలు మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఆరోగ్యశాఖని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు మంచినీటి విషయంలో కూడా ప్రజలను మోసం చేస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం రాకముందుకే ప్రజలు పరిశుభ్రమైన మంచినీళ్లు తాగుతున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు శాఖల వారీగా రాష్ట్రాన్ని మొత్తం నిరార్ధకంగా తయారు చేశారని విమర్శించారు ఈ నరార్ధక వ్యవస్థను సరి చేయాలంటే సమయం పడుతుందని చెప్పారు అదేవిధంగా 6 గ్యారంటీలను వంద రోజులు అమలు చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి తో పాటు శ్రీధర్ బాబు ఉత్తంకుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.