ప్రజా సంక్షేమమే నా దేయం
గూడెం గుండెల్లో నిలిచిన. గోవింద్
వేములపల్లి( ప్రజాలహరి) ప్రజా సంక్షేమమే నాదేమంటూ తిమ్మారెడ్డి గూడెం గ్రామం ప్రజల గుండెల్లో ఇరిగిండ్ల పద్మా గోవిందులు ఆ గ్రామ ప్రజల్లో చిరస్థాయిగా నిలబడి పోయేటట్టుగా పదవి లేకుండా పనులు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలు పైనుంచి తిమ్మారెడ్డి గూడెం గ్రామానికి వెళ్లే రహదారి ఉన్నది అట్టి గ్రామానికి గారు వెళ్లాలంటే ఆ గ్రామ ప్రజలే కాకుండా భీమనపల్లి ,కల్వేలపాలెం, బొమ్మకల్, తోపు చర్ల, ఇసుక బాయ్ గూడెం, పాములపాడు గ్రామాలకు వెళ్లాలంటే వాహన శోధకులు నాన్న తండాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే సోమవారం మాజీ జెడ్పిటిసి ఇరుగు దిండ్ల గోవిందు పద్మ తమ స్వగ్రామానికి వెళ్లాలంటే వారి బాధలు వర్ణతీతంగా ఉన్నాయి. దీంతో వారు పదవితో పనిలేదు అన్నట్టుగా కట్టమీద ఉన్నటువంటి గుంటలను తమ సొంత ఖర్చులతో మట్టి బోసి సదనం చేసే కార్యక్రమానికి పూనుకున్నారు . దీంతో తదితరు గ్రామాల ప్రజలు మాజీ జెడ్పిటిసి పద్మ గోవింద్ లకు హర్షం వ్యక్తం చేశారు. ఏది ఏమైనాప్పటికిని ప్రజా సంక్షేమం కోసం నాకు ఉన్నంతలో నేను పదవి ఉన్నా లేకున్నా పార్టీలకతీతంగా పనిచేస్తానని ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.