Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ మున్సిపాలిటీలో పలు శాఖల సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు చెల్లింపులు లేవు.

Post top

రెండు నెలలుగా జీతాలు లేవు … మిర్యాలగూడ మున్సిపాలిటీలో పరిస్థితి ఇది… మిర్యాలగూడ ప్రజాలహరి….

 

 

మిర్యాలగూడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు చెల్లింపు జరగడం లేదు. మున్సిపాలిటీలో శానిటరీ వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఆఫీస్ స్టాఫ్ లకు మొత్తం 400 మంది పైన ఉద్యోగులు ఉంటారు మీరు అందరికీ 20000 రూపాయలు లోపే వేతనాలు వీరికి రెండు నెలలుగా జీతాలు చెల్లించటం లేదు. ఇటీవల కాలంలో శానిటరీ విభాగానికి చెందిన కొంతమందికి చెల్లింపులు జరిగినాయి .మిగతా మూడు నాలుగు విభాగాల సిబ్బందికి ఈరోజు వరకు వేతనాలు చెల్లించటం జరగలేదు . చాలి చాలని వేతనాలతోనే జీవితాన్ని నెట్టుకు వస్తున్న వారికి వేతనాలు చెల్లింపులు ఆలస్యం కావడం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరందరూ 15 నుంచి 20,000 లోపు జీతగాళ్లే మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కిందిస్థాయి సిబ్బందికి వేతనాలు వెంటనే చెల్లించాలని పలువురు కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వేతనాలు చెల్లింపు విషయంలో నెలవారి చెల్లింపు జరగకపోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చే విషయంలో, మున్సిపాలిటీ మంచి పేరు తెచ్చి విషయంలోన ఈ సిబ్బంది పని కొలమానంగా ఉంటుంది అయినప్పటికీ వారికి వేతనాలు చెల్లించటన ఆలస్యమవుతుంది. సంబంధిత కాంట్రాక్టర్ వేతనాల కోసం చెక్కులు తీసుకువెళ్లిన నేటికీ వేతనాలు చెల్లించలేదని కొంతమంది అంటున్నారు. జీతాలు రాని సిబ్బంది వేతనాల కోసం అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదు రెండు నెలలు పూర్తి మూడో నెలలో అడుగుపెడుతున్న జీతాలు చెల్లింపు మాత్రం జరగటం లేదు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నెలవారీగా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.