ప్రభుత్వాలు పరిశోధనలపై దృష్టి సారించాలి:రచయిత
అల్లం రాజయ్య
మిర్యాలగూడ, ప్రజాలహరి
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రభుత్వాలు పరిశోధనలపై దృష్టి సారించి సాంకేతిక అభివృద్ధికి తోడ్పడాలని కవి రచయిత అల్లం రాజయ్య అన్నారు. బుధవారం అల్లం కిరణ్ 16వ వర్ధన్న పురస్కరించుకొని స్థానిక మిర్యాలగూడలోని లోటస్ పాఠశాలలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లం రాజయ్య మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు నూతన పరిశోధనల కోసం ప్రపంచ దేశాలకు వెళ్లి అగ్రరాజ్య లహంకారానికి బలి అవుతున్నారని అందులో భాగంగానే అల్లం కిరణ్ కూడా బ్రెయిన్ ట్యూమర్ కు సంబంధించిన పరిశోధన కోసం అమెరికా వెళ్లి తుపాకుల తూటాలకు బలి కావడం జరిగిందని అన్నారు. మన దేశం కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందుకు దూసుకుపోవడం జరుగుతుందని మరికొంత పరిశోధనా శాలలను అభివృద్ధి చేసినట్లయితే సర్వతో ముఖాభివృద్ధి జరుగుతుందని అన్నారు. వ్యవస్థాపకులు కేతనపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అల్లం కిరణ్ ఆచరణ సాధించడం కోసం విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం అతని పేరు మీదుగా పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచనలో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో మెడల్ బహూకరించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ వరప్రసాద్, ప్రిన్సిపాల్ శ్రీనివాసరెడ్డి, సమూహ రైటర్స్ పోరం కస్తూరి ప్రభాకర్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, మట్టి మనిషి వేనపల్లి పాండురంగారావు, అల్లం శోభ, జన విజ్ఞాన వేదిక నాయకులు జె కొండల్ రెడ్డి,కందుకూరి సుదర్శన్, ట్రస్మా అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి, డాక్టర్ సాహితీ హరికృష్ణ, శర్మ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు