యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన భాస్కర్ రావు
మిర్యాలగూడ ప్రజాలహరి …
హైదరాబాద్ నగరంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మంగళవారం పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి యశోద ఆస్పత్రి కన్సల్టెంట్ డాక్టర్స్ ను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భాస్కర్ రావు ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరి దీవెనలు కేసీఆర్ తోనే ఉన్నాయని అన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాలని భగవంతున్ని ప్రార్థించినట్టు పేర్కొన్నారు. కాగా, ఈనెల 7న రాత్రి కేసీఆర్ ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారిపడడంతో ఎడమ కాలు తొంటి విరిగింది. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో కేసీఆర్ వైద్య సేవలను పొందుతున్నారు.