త్వరలో మీ ముందుకు వస్తా కేసీఆర్….. ప్రజాలహరి హైదరాబాద్ జనరల్ డెస్క్..
త్వరలో సంపూర్ణ ఆరోగ్యం తో ప్రజల వద్దకు వస్తానని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఆయన ఈరోజు ఒక వీడియోని విడుదల చేశారు. చికిత్స పొందుతున్న సందర్భంలో తనపై అభిమానంతో ప్రేమతో ఆసుపత్రికి వచ్చేవారు సంఖ్య ఎక్కువ కావడంతో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ప్రాబ్లం పెరుగుతుందని నాతో పాటుగా కొంతమంది రోగులకు కూడా ఇబ్బంది కలుగుతుందని అభిమానులు ఎవరు యశోద హాస్పిటల్ వద్దకు రావద్దని వినయం పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ ప్రజా జీవితంలోకి వస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.