మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో మహిళల కు ఉచిత ప్రయాణం 9వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభం…….
ప్రజాలహరి హైదరాబాద్…. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం కింద కల్పిస్తామన్న హామీ కి ముఖ్యమంత్రి ఈరోజు ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టిసి వైస్ చైర్మన్ ఎండి సజ్జనర్ జీవో విడుదల చేశారు 9వ తేదీ మధ్యాహ్నం నుంచి రెండు గంటలకు మహాలక్ష్మి పథకం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించే విధంగా ఉచితంగా ప్రయాణించే విధంగా అనుమతిని ఇచ్చింది .త్వరలో స్మార్ట్ కార్డులు ఇచ్చే అవకాశాలు ఉన్నది వీటితోపాటుగా ట్రాన్స్ జెండర్స్ కూడా అవకాశం కల్పించారు.