ఏఐసిసి సోనియాగాంధీ రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి …………ప్రజాలహరి హైదరాబాద్… తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏనుముల రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎఐసిసి చైర్మన్ సోనియాగాం,ధీ ఏసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే, ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు హాజరయ్యారు. వారి సమక్షంలో స్టేడియం కు ర్యాలీగా వచ్చారు. అక్కడ తెలంగాణ కారునిర్వాహన అధికారి శాంత కుమారి, తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న రాజరికపు పరిపాలన పోయిందని ఇప్పటినుంచి ప్రజా పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అంబేద్కర్ ప్రజా భవన్ కు కంచెలు తొలగించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు .ప్రజలు ఎప్పుడైనా వచ్చి ప్రజాదర్బార్లో తమ సమస్యలు విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. అహంకారం కూడిన పాలనకు రోజులు చెల్లిపోయాయని పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థాయిలో ఉండేటట్టుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు
ఆరు గ్యారంటీల అమలుకు మార్గం సుగమం చేస్తూ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేశారు
ఇచ్చిన హామీ మేరకు వికలాంగురాలైన నిరుద్యోగిని రజినీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైలుపై సంతకం చేసిన సీఎం రేవంత్ రెడ్డి చేసి అందజేశా రు