విజయోత్సరాలిలో పాల్గొన్న బిఎల్ఆర్.
మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి విజయ అనంతరం ఎలక్షన్ రిటర్నింగ్ అధికారుల నుంచి గెలుపొందినట్లుగా పత్రం తీసుకున్నారు ఆ నంతరం ఆయన మిర్యాలగూడ కు బయలుదేరారు.మాడుగుల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు కార్ల తో ఘన స్వాగతం పలికారు. మాడుగులపల్లి నుంచి మిర్యాలగూడ వరకు భారీ ఎత్తున ర్యాలీతో చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. కార్యకర్తలు ఆయన పూలమాలతో సత్కరించారు. ర్యాలీలో పట్టణ ప్రధాన వీధులలో పర్యటించారు. అనంతరం బత్తుల లక్ష్మారెడ్డి కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడుతూ తాను ప్రజలకు సేవకుడు అని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పని చేస్తానని ప్రజలందరూ తన ను అభిమానించి గెలిపించినందుకు వారికి రుణము తీర్చుకుంటానని చెప్పారు. మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని చెప్పారు. ఆయన వెంట అధ్యక్షుడు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, కాంగ్రెస్ నాయకులు ఉపేందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బాలు, శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.