ప్రజలు మార్పు కోరుకున్నారు
* పొత్తు లేకపోవడం వల్ల నష్టం
విలేకరుల సమావేశంలో జూలకంటి
ప్రజాలహరి మిర్యాలగూడ
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు వచ్చాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల కాలంలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు అహంకారంతో నిర్ణయాలు తీసుకున్నాడని, ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అహంకారంతో పాలన సాగించాలని దాని వలన ప్రభుత్వం, పాలకులపై తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. కేసీఆర్ పై తీవ్ర అసంతృప్తి కారణంగా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అన్నారు. ముక్యంగా యువకులు, మహిళలు, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారని చెప్పారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోవడం వల్ల నిరుద్యోగులు అందరూ కాంగ్రెస్కు మద్దతు తెలిపారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలను కేవలం రెండు కూటమి లు గానే చూశారని, ప్రత్యేకంగా ఉన్న మూడో కూటమి ని చూడలేదని చెప్పారు. పొత్తు లేకపోవడం వల్ల సిపిఎంకు ఎన్నికల్లో నష్టం జరిగిందని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రజా పోరాటం నిర్వహించి భవిష్యత్తులో పార్టీ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, జగదీష్ చంద్ర, సత్యనారాయణ రావు, వీరాచారి పాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.