రాజకీయాల్లో వనమాలు దిద్దలే.. కుటిల రాజకీయాలు పై పట్టులేదు. సేవే ఆయన లక్ష్యం అదే ఆయన విజయానికి నాంది. ఆయన ఎవరో కాదు బత్తుల లక్ష్మారెడ్డి.
మిర్యాలగూడ ప్రజాలహరి…. రాజకీయ అరంగేట్రంలో వణామాలు దిద్దలే. సాత్విక స్వభావము సామాన్యుడుతో కలగోలుపు ఇవే ఆయన గెలుపుకు మార్గాలు.. మిర్యాలగూడ నియోజకవర్గానికి సామాజిక సేవ, స్పృహ ప్రజల మనసులో నాటిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే బి.ఎల్.ఆర్ అని చెప్పక తప్పదు.. తాను సంపాదించిన ఆదాయంలో కొంత భాగం ప్రజలకు ఏదో విధంగా అందించాలని తప్పన బి ఎల్ ఆర్ లో ఎప్పుడు కనిపిస్తుంది. గత పది సంవత్సరాల క్రితం తన సామాజిక సేవ కార్యక్రమాలకు అంకురార్పణ వేశారు. అప్పటినుంచి మిర్యాలగూడలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ప్రధానంగా వరలక్ష్మీ వ్రతాలు, అయ్యప్ప స్వాములు భజనలు అన్నదానాలు తర్వాత సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా సంగీత లహరిలు ఒంటి కార్యక్రమాలను ప్రారంభించారు తెలంగాణ గొప్పతనాన్ని చాటే ఓరుగల్లు ఆర్చిని మిర్యాలగూడ జూనియర్ కాలేజీ ముందు ఏర్పాటుచేసి తన సామాజిక కార్యక్రమాలను ప్రవాహాన్ని పెంచారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏ గ్రామంలో నైనా నూతన దేవాలయాలు నిర్మాణం జరిగిన వందలు వేల సంఖ్యలో భోజనాలు తన సొంత ఖర్చులతో మధురమైన పదార్థాల భోజన పదార్థాలను అందించేవాడు. దాంతోపాటుగా ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకునేవాడు మారుమూల గ్రామాల ప్రాంతాల్లో పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టేవాడు . …….సామాజిక సేవలో ఆనందయ్య ముందు హైలెట్….. కరోనా భారతదేశాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఆ సందర్భంలో ప్రజలు అర్ధనాదాలు భయముతో అటుడికి పోతున్నారు వారికి వైద్యం అందటం గగనం అయిపోయింది ఆ సందర్భంలో బి ఎల్ ఆర్ నెల్లూరు నుంచి ప్రకృతి వైద్యం ఆనందయ్య కరోనా మందుని మిర్యాలగూడకు ప్రత్యేకంగా తెప్పించి లక్షల సంఖ్యలో ఇంటింటికి నియోజకవర్గ మొత్తం తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కూడా ఉచితంగా పంపిణీ చేయించారు. సామాజిక సేవలో మరో మారు తన మానవతా దృక్పథాన్ని ప్రకటించారు ఆనందం మందులు పంపిణీ విషయం భారత రాష్ట్రపతి భారత ప్రధాని దృష్టికి కూడా వెళ్ళింది.
మరణం ఒక దుఃఖం ఆ దుఃఖంలో కుటుంబ సభ్యులను ఆదుకోవడం ఒక సేవనే…. అనుకోని సంఘటనలు వల్ల కుటుంబంలో ఎవరైనా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరుగా సానుభూతి వ్యక్తం చేస్తుంటారు సహాయ సహకారాలు అందిస్తుంటారు మన బి ఎల్ ఆర్ మాత్రం అందరికీ భిన్నత్వం ఆయన ఆయన మరణించిన మరణించిన వ్యక్తికి దహన సంస్కారాలు సంస్కారాలు నిమిత్తం అంతిమయాత్రకు వైకుంఠ రథం మరియు మరియు మరణించిన సమయంలో వచ్చిన బంధువులకు 150 నుంచి 200 మందికి ఉచితంగా భోజనాలు పంపిణీ చేయడం వంటి సామాజిక కల్పించే కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులతో మమేకం విద్యార్థులకు పెంపొందించేందుకు గ్రామ తాలూకా జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేయటం వాటి కి క్రీడా సామాగ్రిలు పంపిణీ చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు చేసేవారు. వినాయక చవితులు దసరా వంటి సామాజిక స్పృహ కలిగిన కార్యక్రమాలకు వినాయక విగ్రహాలు దుర్గా విగ్రహాలు అన్నదాన వంటి కార్యక్రమాలు ఎక్కువ శాతం నిర్వహించేవారు. ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు ఆయన భారీ మెజార్టీ కి కారణమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి జరుగుతున్న విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు నోట్బుక్కులు పెన్నులు పరీక్షత్రాలు సైతం నియోజకవర్గ వ్యాప్తంగా అందించి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలబడే వారు. ఆయన చేసిన సేవలు ప్రజలు తమ మనసుల్లో పదిలంగా ఉంచుకొని ఆ సేవను తమ ఓటు ద్వారా ఆ ప్రేమ ఆయన మీద వ్యక్తపరిచారు.