![home side top](https://i0.wp.com/www.prajalahari.com/wp-content/uploads/2024/12/Adobe-Photoshop-PDF-12-09-2024_12_16_AM.png?w=1170&ssl=1)
మోడీని దించితేనే దేశానికి భవిష్యత్తు
* మన మనందరిపైనే ఆ బాధ్యత
* వ్యాపారంగా మారిన రాజకీయం
* చట్టసభల్లో ఎర్రజెండా అవసరం
మిర్యాలగూడ రోడ్ షోలో సీతారాం ఏచూరి
ప్రజాలహరి మిర్యాలగూడ..
ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి దేశాన్ని సర్వనాశనం చేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మోడీని గద్దె దించితేనే దేశానికి భవిష్యత్తు ఉందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాo ఏచూరి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వేములపల్లి నుండి వాడపల్లి వరకు వేలాది వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ వరకు వేలాది మందితో రోడ్ షో చేశారు. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. దేశ సంపదలను కార్పోరేట్ శక్తులకు అప్పనంగా మోడీ అప్పచెబుతున్నాడని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని, కొనుగోలు శక్తి రోజుకు పడిపోతుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని, పౌర హక్కులను రద్దు చేసి తమ సొంత ఏజెండాను ప్రజలపై రుద్దేందుకు చూస్తుందని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. దీనికోసం ప్రజలందరూ ఏకమై భవిష్యత్తులో బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పేదలకు ఆహార భద్రత అందకుండా పాలకులు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి ఎర్రజెండా తోనే సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యం కాపాడడంలో ఎన్నికలు ఎంతో కీలకంగా ఉన్నాయని ఎర్రజెండా నాయకులను గెలిపించి చట్టసభలకు పంపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పారు. నేడు పాలకులు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చారని డబ్బు ఉన్న వారే పోటీ చేసే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు పదవుల కోసం పార్టీల ఫిరాయింపులు చేస్తున్నారని, అలాంటి వారిని ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. బిజెపికి వ్యతిరేకంగా ఇండియా తమ పార్టీ ఉందని తెలంగాణలో కాంగ్రెస్లో పొత్తు కుదరకపోవడం కాంగ్రెస్సే కారణమని చెప్పారు. అనివార్య పరిస్థితిలో సిపిఎం ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చిందని సిపిఎం 19 చోట్ల పోటీ చేస్తుందని చెప్పారు సిపిఎం అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. పేద ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా రంగన్న ఉన్నారని రంగన్ను గెలిపించాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. సిపిఎం అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మీకోసం రంగన్న ను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు తీగల సాగర్, శ్రీ రామ్ నాయక్, రమ, ఎంవి రమణ, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్ డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, నూకల జగదీష్ చంద్ర, పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, వరలక్ష్మి, శశిధర్ రెడ్డి, వినోద్ నాయక్, తిరుపతి రామ్మూర్తి, ఆయూబ్, ఎండి అంజాద్, రొంది శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొ
న్నారు.