*మానవత్వం చాటిన గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి*
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ గవర్నమెంట్ హాస్పటల్ లో 20రోజులుగా అనాదలా పడి ఉన్న ఒక వృద్దుడిని ఆదుకొని మానవత్వం చాటారు.
APలోని తెనాలి గ్రామానికి చెందిన కామిరెడ్డి వెంకట్ రెడ్డి అనే వృద్దుడు అనారోగ్యంతో ఏరియా హాస్పటల్ లో అనాదలా పడిఉండటంతో తెలిసిన వారిని పలకరించడానికి వెళ్ళిన కొండ్రపోల్ గ్రామానికి చెందిన గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, అతనికి ట్రీట్ మెంట్ ఇప్పించి,వెంకట్ రెడ్డి అబ్బాయి నాగిరెడ్డిని పిలిపించి , వారికి మెడిసిన్ ఇప్పించి,బోజన వసతి కల్పించి , వారికి ప్రయాణానికి తన సొంత డబ్బులతో డిజిల్ పోయించి ఆ కుటుంబాన్ని ఆదుకుని మానవత్వం చాటిన *గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి.
గతంలో కూడా కొంతమంది బీదలకు గార్లపాటి శ్రీనివాస్ రెడ్డిగారు ఆర్దిక సహయం అందించారు.
తెనాలిలోని ఏరియా హాస్పటల్ లో చెర్పించి,వారికి ఖర్చులకు కూడా 4వేలు ఆర్దిక సహయం చేసారు.
కామిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబ సబ్యులు ,శ్రీనివాస్ రెడ్డి చేసిన సహయానికి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ,దన్యవాదములు తెలిపారు.