భారీ మెజారిటీ లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్న నల్లమోతు సిద్ధార్థ…
మిర్యాలగూడ ప్రజాలహరి.. ఎమ్మెల్యే భాస్కరరావు గెలుపు కోసం ఆయన కుమారుడైన నల్లమోతు సిద్ధార్థ ప్రచారంలో దూసుకుపోతున్నారు మెజార్టీని అధికం చేయాలని లక్ష్యంగా వార్డుల వారిగా ప్రాంతాలవారీగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు మార్గదర్శకంగా ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ ప్రచారంలో వినూతనశైలిని ప్రదర్శిస్తున్నారు. శనివారం కూరగాయల మార్కెట్ లో పర్యటించారు. ఆ ప్రాంత వ్యాపారస్తులు అక్కడికి వచ్చిన ప్రజలను పలకరిస్తూ వారికి బిఆర్ఎస్ పార్టీ చేసిన సేవలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కరపత్రాలు పంపిణీ చేస్తూ మిర్యాలగూడ నియోజకవర్గానికి భాస్కరరావు చేసిన సేవలను వివరించారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని ఆ విషయాన్ని ప్రజలు మర్చిపోవద్దని కోరారు. పలువురు కార్యకర్తలతో కలిసి ఈ పర్యటన కొనసాగింది