
ఎమ్మెల్యే భాస్కరరావు ప్రచార జోరు
.. పలు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. ప్రజాలహరి మిర్యాలగూడ.. భారత రాష్ట్ర సమితి తన ప్రచార జోరుని కొనసాగిస్తుంది. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని లోని హనుమాన్ పేట్ ,రాజీవ్ చౌక్, రైతు బజార్, మున్సిపల్ కాంప్లెక్స్ తో పాటు ప్రాంతాల్లో ఎమ్మెల్యే భాస్కరరావు సుడిగాలి పర్యటన చేశారు. ఆయన పర్యటనకు విస్తృత స్పందన లభించింది .ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ మిర్యాలగూడ వ్యాపారస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా పట్టణ ప్రాంతాల్లో ఉంచి నేషనల్ హైవేను తీసుకు వెళ్లినట్లు గుర్తు చేశారు. వ్యాపార వర్గాలకు ఎప్పుడు అండగా ఉంటానని పేర్కొన్నారు. మిర్యాలగూడ పాతబస్తీ అయినా కూరగాయల మార్కెట్ భవిష్యత్తు కాలంలో వ్యాపారం నిర్వహిస్తున్న వారికి పూర్తిస్థాయిలో కేటాయించడం జరుగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే భాస్కరరావు మున్సిపల్ చైర్మన్ భార్గవ్ కలిసి నమూనా బ్యాలెట్ ను ప్రజలకు విశదీకరించారు. రెండో నెంబర్ లో ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి మూడోసారిగా గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు