*వేములపల్లి మండలంలో వేలాదిగా కదిలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.. ఘన స్వాగతం పలుకుతున్న గ్రామస్థులు.*
ప్రజాలహరి మిర్యాలగూడ… ప్రజా సేవ జీవిత పరమావద్దని మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు ఆయన ఈరోజు వేములపల్లి మండలంలో పర్యటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈనాడు పదవుల ఆశించకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాను చెప్పారు తాను పార్టీలో చేరిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్కు ఇరవై ఒక్క కౌన్సిల్స్ వచ్చాయని గుర్తు చేశారు.
అధికార పార్టీ ఎన్ని బెదిరింపులకు ప్రలోభాలు గురి చేసిన పార్టీ కార్యకర్తలు ఒక్కరు కూడా చెక్కుచెదరలేదని తెలిపారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా కార్యక్రమలు నిర్వహిస్తానని తెలిపారు
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములపల్లి మండలంలోని *గోగువారి గూడెం నుంచి ప్రారంభమై అన్నపురెడ్డి గూడెం, శెట్టిపాలెం, పచ్చారుగడ్డ, మొల్కపట్నం, రావులపెంట, ఎరుకలగుట్ట, తాళ్ళగడ్డ, పాములపాడు, పోరెడ్డిగూడెం, చిరుమర్తి, అగమోత్కుర్* గ్రామాలలో పర్యటించడం జరిగింది . . గోగువారి గూడెం నీరుడి అనిల్ ఆధ్వర్యంలో BRS పార్టీ ఉప సర్పంచ్ కొండా సతీష్, వార్డ్ మెంబెర్స్ ధైద మాధవి, గావాండ్ల సుజాన, టిడిపి నాయకులు నర్సింగ్ శ్రీనివాస్ లను మరియు అన్నపురెడ్డి గూడెం గ్రామానికి చెందిన BRS నాయకులు 20 మంది*బత్తుల లక్ష్మారెడ్డి గారి* కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ గ్రామాన ప్రజల్లో వస్తున్న ఆదరణ చూస్తుంటే మిర్యాలగూడ గడ్డ పై కాంగ్రెస్ విజయం కాయం అని అర్థం అవుతోందని అన్నారు … ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, ఎంపీపీ సునీత కృపయ్య , సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .