ప్రజాలహరి మిర్యాలగూడ…..మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కొనసాగడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు కు మరోసారి పట్టం కట్టాలని ఆయన సతిమణీ నల్లమోతు జయ ప్రజలను కోరారు. పట్టణంలోని శాంతినగర్, హౌసింగ్ బోర్డు కాలనీ ప్రాంతాలలో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జరిగింది. ఆయా ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్ళి, ఓటర్లను కలుసుకుని, కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసారు.*
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ ఛైర్మన్ యడవల్లి శ్రీనివాస రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, మాజీ కౌన్సిలర్ మన్నెం లింగారెడ్డి, నాయకులు పగిడిమర్రి నాగేంద్రాచారి,గంటా శ్రవణ్ రెడ్డి, సక్రాం నాయక్, కత్రోజు దుర్గాప్రసాద్ , యడవల్లి సాధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.