మిర్యాలగూడ ప్రజాలహరి… అభివృద్ధి సంక్షేమమే తన లక్ష్యమనీ బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు .మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని గదగుండ తండ, అన్నారం, విటి పాలెం, దుర్గా నగర్, జంకు తండ, శ్రీనివాస్ నగర్, పాత సామేగాని తండ, తుంగపాడ్, రామన్న, భువనగిరి, లావుడి తండ, జాగారం తండ, తులసి తండ, దుబ్బ తండ , మూడు గుడిసెల తండ, చిల్లాపురం, కోక్యా తండ, గోపసముద్రం తండ, రాఘవ పురం, వాటర్ ట్యాంక్ తండ, కురియ తండ , కుంటకింద తండ, ఐలాపురం, మైసమ్మ కుంట తండ, గూడూరు, గూడూరు తండ, కృష్టాపురం, అజ్మీరా తండాలలోపర్యటించడం జరిగింది.. అడుగడుగునా గిరిజన తండాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతో పాటు మన BLR బ్రదర్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆడబిడ్డల పెళ్లి లకు, శ్రీ శ్రీనివాస కల్యాణ శుభమస్తు పెళ్లి కనుకతో పాటు ఒక బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు మా ఇంటి నుంచే పంపిస్తామన్నారు, అలాగే మండల కేంద్రంలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెడిసిన్ ఇప్పిస్తానని అన్నారు .ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.