*39వ వార్డులో జోరుగా బిఎల్ఆర్ గారి సతీమణి మాధవి గారి ప్రచారం*
మిర్యాలగూడ ప్రజలహరి….
ఈరోజు మిర్యాలగూడ 39 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భక్తుల లక్ష్మారెడ్డి సతీమణి శ్రీమతి మాధవి ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారంలో వారితోపాటు 39 వ వార్డు ఇంచార్జ్ సలీం మరియు మిర్యాలగూడ పార్టీ ప్రముఖులు అదేవిధo గా ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు ఆరిఫ్ వార్డు సభ్యులు,యూత్ మరియు వార్డు ప్రజానీకం అధికంగా పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేయడం జరిగినది .
మాధవి మాట్లాడుతూ 39వ వార్డులో ప్రజలు తమకు ఇస్తున్నటువంటి ప్రేమకు మరియు అభిమానానికి రుణపడి ఉంటామని 39వ వార్డు ప్రజల సమస్యలని కచ్చితంగా నెరవేరుస్తామని 39వ వార్డు ప్రజలకు అండదండగా ఉంటామని ప్రజలందరూ కూడా బిఎల్ఆర్ గారికి 30 తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు వేసి భారీ మెజార్టీ తోటి వారికి గెలిపించాలని చేయాలని కోరారు.