
మిర్యాలగూడ ప్రజాలహరి….*మిర్యాలగూడ పట్టణంలోని 29 వ వార్డు దయాకర్ రెడ్డి మరియు బంగారుగడ్డకు చెందిన 500 మంది మున్సిపల్ వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.బిఆర్ఎస్ లో చేరిన వారందరికీ గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు.కార్యాలయం ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టి గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, కౌన్సిలర్ కుర్రు చైతన్య, బీఆర్ఎస్ నాయకులు పెద్ది శ్రీనివాస్ గౌడ్, గోపాలకృష్ణ, లింగంపల్లి చిరంజీవి, నూనె రవికుమార్, నేరెళ్ల ఒక్కయ్య, కరీం, ఆసిం, ఇమ్రాన్ తదితరులు పాల్గున్నారు.