*మిర్యాలగూడ ప్రజాలహరి…..మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్ కు చెందిన యువకులు బిజెపికి రాజీనామా చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన వారందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారు గులాబీ కండవాలు కప్పి స్వాగతించారు పట్టణాభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరడం ఆనందంగా ఉందన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.*
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.