మిర్యాలగూడ ప్రజాలహరి..
*మిర్యాలగూడ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగంట్ల లింగయ్య యాదవ్ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఅర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. మండలంలోని తుంగ పహాడ్ గ్రామానికి చెందిన లింగయ్య యాదవ్ తో పాటు మొత్తం 100 మంది బీఆర్ఎస్ లో చేరారు పార్టీలో చేరిన వారికి గులాబీ కండవాలు కప్పి స్వాగతించారు.*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి ఆదరణ పెరిగిందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారుగుర్తుకు ఓటౌసి, భారీ మెజారిటీలో తనను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, నాయకులు సజ్జల శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ బత్తుల లక్ష్మయ్య, తుమ్మల ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.