లక్ష్మారెడ్డి కి ఘన స్వాగతం…
గిరిజన ప్రాంతాల అభివృద్ధి కృషి చేస్తా…
మిర్యాలగూడ ప్రజాలహరి…
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామం నుంచి ప్రారంభమై కల్లేపల్లి, గాంధీ నగర్, తిమ్మాపురం, పడమట తండా, తూర్పు తండా, పుట్టలగడ్డ, శాంతి నగర్, నర్సాపురం* మీదగా నిర్వహించడం జరిగింది.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు తాను పదవుల కోసం పనిచేయలేదని అన్నారు ప్రజల్లో ఒకడిగా ఉంటూ ప్రజల సమస్యల కోసం పరిష్కారం పనిచేయడమే తన లక్ష్యమని అన్నారు . గిరిజనులు ఇంతగా ఆదరించి స్వాగతం పలికిన వారికి వారిని ఎప్పటికీ మరువనని తెలిపారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మండల పార్టీ ప్రసిడెంట్ గాజుల శ్రీను, YSRTP జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజం నర్సిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు..