మిర్యాలగూడలో ఎర్ర జెండా ఎగరడం ఖాయం
* పదేళ్లలో బాస్కర్ రావు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి
* కౌన్సిలర్ గా పనికి రానోడు…ఎమ్మెల్యే గా ఎం చేస్తాడు…
* బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీ అభ్యర్థులను ఓడించాలి
* సిపిఎంకు అన్ని వర్గాల ప్రజల మద్దతు
మిర్యాలగూడ ప్రజాలహరి…
జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో ఎర్రజెండా ఎగరడం ఖాయమని సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మిర్యాలగూడలో ఎన్నికలు ధన బలం, ప్రజాబలం మధ్య పోరాటం జరుగుతుందని అందులో ప్రజాబలం ఉన్న సిపిఎం అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారు అయిందన్నారు. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న భాస్కర్ రావు నియోజవర్గ అభివృద్ధి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసని, కౌన్సిలర్ గా పనికిరాని వాడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏం చేస్తాడో మీరే అర్థం చేసుకోవాలని కోరారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పెట్టుబడి పెడుతున్నారని గెలిచాక పదింతలు సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బిఆర్ఎస్ అభ్యర్థి తాను చేసినట్లు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ పదేళ్ల కాలంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. డబ్బు ఉందని అహంకారంతో ఓట్లను కొనుగోలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు స్థానిక ఎమ్మెల్యే పై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆరోపించారు. సేవా ముసుగులో రాజకీయం చేస్తూ పల్నాడు రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారని విమర్శించారు. సిపిఎం మద్దతుతో పట్టణంలో రవీంద్ర నగర్ కౌన్సిలర్ గా గెలిపిస్తే ఆ వార్డును ఇప్పటివరకు చూసిన దాఖలాలు లేవని కనీస సౌకర్యాలు తీర్చ లేదన్నారు. కౌన్సిలర్ ఎన్నికల్లో రెండు కోట్లు ఖర్చుపెట్టి వార్డును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి ఆ వార్డు ప్రజలను మోసం చేశారని ఇప్పుడు సేవా ముసుగులో ఎమ్మెల్యే కావాలని చూస్తున్నాడని విమర్శించారు. వార్డు కౌన్సిలర్ కు న్యాయం చేయలేని వారు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేస్తారని ప్రశ్నించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అసెంబ్లీలో చివరి బెంచ్ లో కూర్చుంటారని కనీసం సమస్యలను ప్రస్తావించేందుకు కూడా అవకాశం దొరకదని చెప్పారు అదే తనను గెలిపించినట్లైతే ముందు సీట్లో కూర్చుంటానని ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు భవిష్యత్తులో పార్టీలు మారమని గ్యారెంటీ ఇవ్వగలరని ప్రశ్నించారు. అదే తనను గెలిపిస్తే పార్టీలు మారకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ఏజెండగా పనిచేస్తానని నియోజవర్గ ప్రజల గౌరవం పెంచే విధంగా వ్యవహరిస్తానని చెప్పారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల నుండి రంగన్నకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రంగన్నకు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు అందరివాడిగా, అందరికీ అన్నగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేసే రంగాలను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆ పార్టీలను ఓడించి బుద్ధి చెప్తారని తెలిపారు. అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు రంగన్నకు అన్ని వర్గాల ప్రజలు మరింత మద్దతు నిలవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, భావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి పరశురాములు, పగిడోజు రామ్మూర్తి, దేశి రామ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు