
ప్రశ్నించే గొంతుకలను గెలిపించండి
మిర్యాలగూడ సిపిఐ(ఎం) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి
అడవిదేవులపల్లి ప్రజాలహరి
చట్టసభల్లో ప్రశ్నించే గొంతుకలను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని మిర్యాలగూడ సిపిఐ(ఎం ) అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం అడవిదేవులపల్లి మండల పరిధిలోని ఉల్సాయిపాలెం, మొలక్కచర్ల, చింత చెట్టుతండా,బాల్నేపల్లి, చిట్యాల, గోనియా తండా,చంప్లా తండా, కొత్త నందికొండ,జీలకర్ర కుంట తండా, అడవిదేవులపల్లి, ముది మాణిక్యం గ్రామాల్లో ప్రచార నిర్వహించారు. ప్రతి గ్రామంలో తండాల్లోమంగళ హారతులతోమహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే కమ్యూనిస్టులను గెలిపించాలని ప్రజలను కోరారు. మిర్యాలగూడ నియోజవర్గంలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల తరఫున పారిశ్రామికవేత్తలు పోటీలో ఉన్నారు వారిని గెలిపిస్తే కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తారని తాను గెలిస్తే అట్టడుగు వర్గాల వారి కోసం పనిచేస్తను అని హామీయిచ్చారు.తను జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతకు కృషి చేశానని తెలిపారు.అడవిదేవులపల్లి మండల ఏర్పాటుకుప్రజలతో కలిసి పోరాడి సాధించాం అనిఅన్నారు. పేదల కోసం, దళిత గిరిజనుల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం,విద్యార్థి యువజన హక్కుల కోసం, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు వేతనాలు పెంపు కోసం గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంపు కోసం, కార్మిక కర్షక వర్గాల వారికోసం, వారి హక్కుల కోసం ఎర్ర జెండా నిరంతరం పోరాడుతుందని అన్నారు. బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏనాడు పేదల కోసం పోరాడ లేదన్నారు. గత ఎన్నికల్లో కేసరిచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు కాలేదు అన్నారు.ఈనెల 30న జరిగేఎన్నికల్లోసుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసిగెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘ కార్యదర్శి శ్రీరాములు నాయక్, మండల కార్యదర్శి జఠంగ సైదులు, కుర్ర సైదా నాయక్, సీనేని రాంబాబు, రామాంజి, శివ నాయక్, కోటిరెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు