మిర్యాలగూడ ప్రజాలహరి…బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావుకు మద్దతుగా ఆయన సతీమణి శ్రీమతి నల్లమోతు జయ ప్రచారంలో పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి, గత తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టి ప్రజలకు వివరించారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రీ నల్లమోతు భాస్కర్ రావు నిరంతరం ఆకాంక్షిస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియోజకవర్గ ప్రజల గడపగడపకూ సంక్షేమ ఫలాలు దక్కే విధంగా ఆయన నిత్యం కృషి చేస్తుంటారని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు నిధులను మంజూరు చేయిస్తూ తొమ్మిది సంవత్సరాల్లో మిర్యాలగూడ రూపు రేఖలను మార్చేశారని, మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధిపై ఆయనకు ఉన్న విజన్ మరే నాయకుడికి ఉండదని తాను భావిస్తున్నానని అన్నారు. అనునిత్యం మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారిని బంపర్ మెజారిటీతో గెలిపించాలని శ్రీమతి నల్లమోతు జయ కోరారు. నవంబర్ 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై నమోదు చేయాలని ఆకాంక్షించారు. మిర్యాలగూడ నియోజకవర్గ ప్రగతి రథ చక్రాలు నిరాటంకంగా ముందు కెల్లాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.