ఎమ్మెల్యే సతీమణి జయ ఇంటింటి ప్రచారం…
ప్రజాలహరి మిర్యాలగూడ..
భారత రాష్ట్ర సమితి మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు గెలుపు కోసం ఆయన ధర్మపత్ని జయ మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ,ఆయన ధర్మపత్ని నాగలక్ష్మి తో కలిసి మిర్యాలగూడ పట్టణంలో పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ ఎమ్మెల్యేగా భాస్కరరావు గెలుపు పొందిన తర్వాతే పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని పేర్కొన్నారు మూడోసారి గెలిపించాలని కోరారు. వారికి ఆయా ప్రాంతాల్లో ప్రజలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికి పూలమాలలతో అలంకరించారు.