మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి – ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరచర్ల మండలం కేశవ పురం గ్రామం నుంచి ప్రారంభమై *రామోజీ తండా, దన్యాల బండ తండా, మాన్ తండాలలో* పర్యటించడం జరిగింది .. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ , కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, మండల పార్టీ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సైదా నాయక్, ఎంపీటీసీ లు రజిత దేవేందర్, నాగు నాయక్, సర్పంచులు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ భాగ్య నాయక్ ఆశయాలు సాధించాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు ఆయన కుమారుడు స్కైలాబ్ నాయక్ ధర్మపత్ని భారతి కాంగ్రెస్ పార్టీలో చేరారని వారి సహకారంతో నియోజక అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.