ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటా
* మసీదుల వద్ద జూలకంటి ప్రచారo. మి ర్యాలగూడ, ప్రజాలహరి…
నిరంతరం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటానని సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు శుక్రవారం పట్టణంలోని కరీం మజీద్ పెద్ద మసీద్, చిన్న మసీద్, షాబునగర్ మసీదుల వద్ద ముస్లింలను కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలో ముస్లింల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానన్నారు. ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు పట్టణంలో షాది ఖానా ఏర్పాటు చేశారని నిర్మించానని చెప్పారు. కబరస్తాన్ కోసం మండలంలోని అవంతిపురం వద్ద 7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇప్పిచ్చినట్టు తెలిపారు. మిర్యాలగూడలో మత ఘర్షణలు లేకుండా లౌకికవాదాన్ని కాపాడేనన్నారు. ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. మా సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం అండగా నిలిచిన మీకు మా మద్దతు పూర్తిగా ఉంటుందని ముస్లింలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బి కార్ మల్లేష్, నాయకులు రావి నాయక్, డా. మల్లు గౌతమ్ రెడ్డి, ఎండి అంజాద్, వదూద్, ఆఫన్ అలీ, వెంకటయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.