ఐటీ దాడులతో అట్టుడికిన మిర్యాలగూడ……………..
ప్రజాలహరి క్రైమ్మిర్యాలగూడ;
P ఐటీ దాడులతో మిర్యాలగూడ అటూడికి పోయింది మిర్యాలగూడ రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఐటి అధికారులు పలు రైస్ మిల్లులు ఎమ్మెల్యే అనుచరుడైన శ్రీధర్ ఇల్లు ఫ్యాక్టరీలతో పాటు మరికొన్ని స్థలాల్లో ఐటీ రైట్స్ జరగడంతో ఒక్కసారిగా మిర్యాలగూడ హాట్ హాట్ గా మారింది.
మిర్యాలగూడలో పలు రైస్ మిల్లులలో ఐటి దాడులు జరిగాయి కాగా ఎమ్మెల్యే, బండారు కుశలయ్య ,రంగా రంజిత్, శ్రీధర్ సంబంధించిన ఫ్యాక్టరీస్ రైస్ ఇండస్ట్రీస్, పలు ఆస్తులు మీద దాడి జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నప్పరెడ్డి గూడెంలో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్ రావు స్పందిస్తూ తన ఇంటి పై కానీ తన కుమారుల ఇంటిపై గాని ఎక్కడ ఐటి రాడ్స్ జరగలేదని కొందరు కావాలని పని కట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు నాకు అక్రమంగా ఆస్తులు లేవని ఉన్నట్లయితే వాటికి టీవీ ఛానల్ కు రాసిస్తానని ఆయన పేర్కొన్నారు. అధికారులు మమ్మల్ని సంప్రదింపులు లేవని మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.