
*భాస్కర్ రావు పై అసత్య ఆరోపణలు మానుకోవాలి*
-బి.ఎల్.ఆర్ ఓటమి భయంతోనే కుట్రలు
-సేవా ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నాడు.. బి.ఎల్. ఆర్
వేములపల్లి, నవంబర్ 15, ప్రజాలహరి
మిర్యాలగూడ ఎమ్మెల్యేగా నల్లమోతు భాస్కర్ రావు గత పది ఏళ్లుగా నిస్వార్ధంగా,అన్ని రంగంలో అభివృద్ధి చేస్తున్న విషయాలను ఓర్వలేక అవినీతి చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.ఎల్.ఆర్ అసత్య ఆరోపణలు మానుకోవాలని వేములపల్లి బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు పిండి సతీష్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక నాయకులతో కలిసి మాట్లాడారు. దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామానికి చెందిన బి.ఎల్.ఆర్ పదవికాంక్షతో సేవ ముసుగులో మిర్యాలగూడ ప్రజలను ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు.నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత భాస్కర్ రావు పై ఆరోపణలు చేసే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.ఎమ్మెల్యే భాస్కర్ రావు హ్యాట్రిక్ విజయాన్ని జీర్ణించుకోలేక ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ 12వ వార్డు మెంబర్ శీలం సైదులు,రేవల్లి రామచంద్రు,నాయకులు పురాణపు సైదులు, జన్ను,చిట్యాల పవన్,జిన్న శివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.