*మిర్యాలగూడ ప్రజాలహరి…. సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ళుగా చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోంచించి ఓటేయాలని మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారు కోరారు.*
బుధవారం దామరచర్ల మండలంలోని కొత్తపేట తండా, దూద్యాతండా, గోన్య తండా, బాల్య తండ, పెద్ద తండా, కేజేఆర్ కాలనీ, దంజ్యా తండా, కేతావత్ తండ, ఎడుగుట్టతండ, నీమ్యాతండ, తూర్పుతుండ, బాలాజీనగర్, గణేష్ పహాడ్, తాళ్ళ వీరప్పగూడెం తదితర గ్రామాల్లోనీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ ప్రగతి యాత్ర జరిగింది. ఆయా గ్రామాల్లో యువతీ,యువకులు, మహిళలు, రైతులు, వృద్ధులు స్వచ్ఛంధంగా తరలివచ్చి తమ అభిమాన నాయకుడు, అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావును ఘనంగా స్వాగతించారు. పూలమాలలు వేసి అభినందించారు. దారి పొడవునా పూలవర్షం. కురిపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు గారు మాట్లాడుతూ తన నాలుగు దశాబ్ధాల ప్రజా జీవితంలో గిరిజనులతో విడదీయరాని అను బంధం ఉందన్నారు. పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని, అందులో భాగంగానే మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్లు, బిటి రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ సరఫరా తదితర అభివృద్ధి పనులు చేసానన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికీ చేర్చడం తమ భాధ్యతగా భావించి కృషి చేసానని వివరించారు.
గిరిజనులకు పోడు భూముల పట్టాలు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మారుమూల గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణా జలాలు అందించామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని సంక్షేమ పథకాలను మళ్ళీ రానున్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి తనను మూడోసారి గెలిపించాలని కోరారు.
ఈ క్యాక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జడ్పిటిసి ఆంగోతు లలిత హాతారాం, ఏఎంసి ఛైర్మన్ బైరం బుచ్చయ్య, వైస్ ఛైర్మన్ కుందూరు వీర కోటిరెడ్డి, వైస్ ఎంపిపి కటకం సైదులురెడ్డి, ఆ మండల ప్రధాన కార్యదర్శి దార గాని వెంకటేశ్వర్లు, వివిధ గ్రామాల సర్పంచులు ధనవ శాంతి ప్రకాశ్, ధనావత్ శారద సైదానాయక్, ధనావత్ యమన రాంసింగ్, గుగులోతు శాంతి తుల్చా, రవీందర్, జ్యోతి సైదులు, బాలసుజాత శ్రీనివాస్ నాయుడు, ఎంపీటీసీ వీరానాయక్, పిఎసిఎస్ డైరెక్టర్లు, రైతు బంధు సమితి అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, అనుబంధ సంఘాల అద్యక్ష కార్యదర్శులు, బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.