మిర్యాలగూడలో ఎర్ర జెండా ఎగరడం ఖాయం.
* ధన బలం ప్రజాబలం మధ్యనే పోటీ
ప్రజాలహరి మిర్యాలగూడ..
ధన బలం… ప్రజా బలం మధ్య జరుగుతున్న ఎన్నికలలో ఎర్రజెండా ఎగరటం ఖాయమని నల్గొండ జిల్లా మిర్యాలగూడ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థిజూలకంటి రంగారెడ్డి ధీమా..వ్యక్తం చేశారు. మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరిపారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు అభిమానులు శాలవలు. పూలదండలతో సన్మానించి అభినందనలు తెలిపారు. మహిళలు మంగళ హారతులు పడుతూ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. నయా నవాబు మాదిరిగా దొరల గడీల పాలన సాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో లేని అధికార పార్టీ ఎమ్మెల్యే వల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తాను మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయి తప్ప కొత్తగా ఏమీ లేదని ప్రజలు గుర్తించాలన్నారు. దాన ధర్మాల ముసుగులో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజ స్వరూపం ఈ ఎన్నికల్లో బట్టబయలైందన్నారు. సొంత పార్టీ టికెట్ కేటాయించక ముందే నామినేషన్ వేసి తన అధికార దాహాన్ని ప్రదర్శించాడని విమర్శించారు. తాను కౌన్సిలర్ గా గెలిచిన వార్డునే చక్కదిద్దుకోలేని ఆయన నియోజకవర్గ మొత్తాన్ని ఏ మేరకు ఉద్ధరిస్తాడో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కోసం పోరాటం చేయలేకపోయినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసెంబ్లీలో ప్రజల కోసం ఏం మాట్లాడుతాడు.. ఏం పోరాటం చేస్తాడు అని జూలకంటి ఏద్దేవా చేశారు . కాంగ్రెస్ బీఅర్ఎస్ అభ్యర్థులు దందాలు చేసి మిర్యాలగూడను దోచుకోవడానికే ఓట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలవడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలని కోరారు. నీతి నిజాయితీగా పార్టీలకు అతీతంగా చట్టసభల్లో ప్రజా గొంతుక వినిపించే అందరివాడుగా ప్రజలు తనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని. మిర్యాలగూడ గడ్డపై మరోసారి ఎర్రజెండా ఎగరటం ఖాయమని జూలకంటి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు రవి నాయక్ చౌగాని సీతారాములు, సైదమ్మ, రాగిరెడ్డి మంగారెడ్డి, పోలేపల్లి గోవింద్ రెడ్డి,రామకృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు