భాస్కర్ రావు పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు…. మిర్యాలగూడ ప్రజాలహరి…. ఎమ్మెల్యే భాస్కరరావు పై అనుచిత వ్యాఖ్యలు అసందర్భ ఆరోపణలు సత్య దూరమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని మిర్యాలగూడ భారత రాష్ట్ర సమితి నాయకులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు సీనియర్ నేత నాగార్జున చారి లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లక్ష్మారెడ్డి సేవ పేరుతో రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. సేవా తత్పరుడైతే రాజకీయాల్లో ఎందుకు వచ్చినట్టు వారు ప్రశ్నించారు. అంతేకాకుండా మిర్యాలగూడ ను అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న భాస్కరరావును దూషిస్తే సహించేది లేదని చెప్పారు. లారీల వ్యాపారాలు చేసుకుంటూ ఎదిగిన లక్ష్మారెడ్డి మిర్యాలగూడ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని పేర్కొన్నారు. ఆయన గెలిచిన వార్డుకు సక్రమంగా నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని గెలిచిన నాటి నుంచి నేటి వరకు సొంత వార్డు లో పర్యటించన వ్యక్తి ఆని వారు వివరించారు. ఆయన మాటలు తప్ప చేతల్లో ఏమీ చేయడని ఆయన ను నమ్ముకొని ప్రజలు నష్టపోవద్దని చెప్పారు .భాస్కర్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు స్మశాన వాటికలు ,భవన నిర్మాణాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నర ని వివరించారు. సత్యదూరమైన ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లిస్తామని ఘాటుగా విమర్శించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.