ప్రజా సమస్యలపై పోరాడే కమ్యూనిస్టులని అసెంబ్లీకి పంపాలి… జూలకంటి రంగన్న
* హారతులు పట్టి స్వాగతం పలుకుతున్న మహిళలు
* ఓట్లు అడుగుతున్న సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన్న
ప్రజాలహరి వేములపల్లి నవంబర్ 14: ప్రజా సమస్యలపై నిత్యం ప్రభుత్వాలను నిలదీసీ ప్రశ్నించే కమ్యూనిస్టు పార్టీలకు ఓటు వేసి గెలిపించి అసెంబ్లీకి పంపాలని సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం మండలంలోని శెట్టిపాలెం, మొల్కపట్నం, రావులపెంట, లక్ష్మీదేవి గూడెం, ఆమనగల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ధన బలంతో ఓట్లు కొనాలని చూసే బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చెప్పాల్సిన అవసరం ప్రతి ఓటర్ పై ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసినట్లయితే మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని పల్నాడు, ఆంధ్ర సంస్కృతులను ఈ ప్రాంత ప్రజలపై బలవంతంగా రుద్ది విద్వేషకర వాతావరణాన్ని నెలకొల్పే ప్రమాదం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ పార్టీ ప్రధాన అజెండా అని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఓటు వేసి గెలిపిస్తే అసెంబ్లీలో ముందు వరుసలో కూర్చుని మిర్యాలగూడ అభివృద్ధికి, నిరంతరం పోరాడుతానన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే ఉపాధి హామీ చట్టం వచ్చిందని, జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు వచ్చాయన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఎం పార్టీకి ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటరును అభ్యర్థించారు. కార్యక్రమంలో ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా కార్యదర్శి డి. వెంకట్, జిల్లా కార్యదర్శి డబ్బికారు మల్లేష్, సిఐటియు నాయకురాలు రమ, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్ధని,నాయకులు పాదూరి శశిధర్ రెడ్డి, పాల్వాయి రామ్ రెడ్డి, రెమడాల పరశురాములు, ఐద్వా నాయకురాలు పోలేబోయిన వరలక్ష్మి, రెమడాల బిక్షం, పతాని శీను, రొండి శ్రీను,కందుల నాగిరెడ్డి, వడ్డగానే సైదులు తదితరులు పాల్గొన్నారు.