లౌకిక వాదాన్ని కాపాడేది కమ్యూనిస్టులే
* ప్రమాదకర బిజెపి బీఆర్ఎస్ లను ఓడించాలి
* సెమినార్లో మాజీ ఎమ్మెల్యే గపూర్
మిర్యాలగూడ… ప్రజాలహరి
ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు లౌకిక వాదాన్ని కమ్యూనిస్టులే కాపాడుతారని మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ అన్నారు అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి స్థానిక కరీం ఫంక్షన్ హాల్ లో ప్రస్తుత రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలు మన కర్తవ్యం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రమాదకరంగా మారిందని మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని ఆరోపించారు దేశ సంపదను ఆదాని, అంబానీ లకు ధారా దత్తo చేస్తున్నాడని విమర్శించారు. మోడీ మరోసారి ప్రధాని అయితే దేశాన్ని అమ్మేస్తాడని ధ్వజమెత్తారు. మోడీని గద్దె దించేందుకే ఇండియా కూటమిలో చేరామని చెప్పారు. కెసిఆర్ బిజెపితో లోపాయి కారికంగా ఒప్పందం చేసుకోవడం వల్లనే వామపక్షాలతో దూరమయ్యాడని తెలిపారు. కాంగ్రెస్ తో సీట్ల విషయంలో జాప్యం చేయడం వల్లనే సిపిఎం ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. బిజెపి,బీఆర్ ఎస్ లకు వ్యతిరేకంగా ప్రధానంగా సిపిఎం పోరాడుతుందని సిపిఎం అభ్యర్థులను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తనను గెలిపించి అసెంబ్లీకి పంపించితే అసెంబ్లీలో ముందు సీట్లో కూర్చుంటానని ప్రజా సమస్యలపై ప్రభుత్వంను నిలదీసే అవకాశం ఉంటుందన్నారు. నియోజవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ఇతర పార్టీల నాయకులను గెలిపిస్తే చివరి సీట్లలో కూర్చుంటారని వాళ్లు పైరావీలు, అక్రమాలు అవినీతిలకు పాల్పడడమే తప్ప ప్రజా సమస్యలను ప్రస్తావించే అవకాశం దొరకద అన్నారు. తాను అందరివాడినని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కారాన్ని కృషి చేస్తానన్నారు. ముస్లింల సంక్షేమo తో పాటు వారి అభివృద్ధికి పాటుపడతారన్నారు. ముస్లింలకు అనుకూలంగా ఉండే విధంగా షాదిఖాన నిర్మించి ఇస్తానని, మసీదుల అభివృద్ధికి పాటుపడతారని, స్మశాన వాటిక పారి గోడ నిర్మాణం కు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులు చాంద్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఫ్తి ఇమ్రాన్, రఫీఉద్దీన్, సీనియర్ జర్నలిస్ట్ ఖాజా హామీదోద్దీన్, ముఫ్తి ఉమర్, హాఫిజ్ రఫీ, ఆర్షద్, సీపీఎం నాయకులు డబ్బికార్ మల్లేష్, డా.మల్లు గౌతమ్ రెడ్డి అవాజ్ నాయకులు వదూద్, సమద్, జహంగీర్, కరీం, అంజాద్ తదితరులు పాల్గొన్నారు.