Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ ఎన్నికల బరిలో 45 మంది అభ్యర్థుల పోటీ

Post top

మిర్యాలగూడ నియోజకవర్గ ఎన్నికల బరిలో 45 మంది అభ్యర్థులు….

ప్రజాలహరి మిర్యాలగూడ…. నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ఈరోజు స్థానిక ఆర్డీవో కార్యాలయంలో స్క్రూట్ని జరిగినాయి. ఇందులో 12 మంది అభ్యర్థులను వివిధ కారణంగా వారి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు . జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలతో కలిపి పోటీలో 45 మంది అభ్యర్థుల నామినేషన్లను పోటీకి అర్హులుగా ఎలక్షన్ అధికారులు నిర్ధారించారు. భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి జూలకంటి రంగారెడ్డి, భారత రాష్ట్ర సమితి నుంచి నల్లమోతు భాస్కరరావు, భారత కాంగ్రెస్ పార్టీ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి ,భారతీయ జనతా పార్టీ నుంచి సాధినేని శ్రీనివాసరావు, ప్రధాన అభ్యర్థులుగా ప్రస్తుతం బరిలో ఉన్నారు. జన శంఖారావం నుంచి అశోక్ రెడ్డి, జై స్వరాజ్ పార్టీ నుంచి కొమ్ముగంటి రాఘవరాణి , ప్రజావాణి పార్టీ నుంచి కోలా సైదులు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా నుంచి వసుకుల గోపి, ధర్మ సమాజ పార్టీ నుంచి తరి ఎల్లయ్య, నవరంగ కాంగ్రెస్ పార్టీ నుంచి దేవలపల్లి కార్తీక్ రాజు, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ,బహుజన ముక్తి పార్టీ నుంచి వజ్రగిరి పెద్ద అంజయ్య ,భారత చైతన్య యువజన పార్టీ నుంచి బొడ్డు వెంకటేశ్వర్లు, విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి కుక్కుడాల మనోజ్ కుమార్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి రవి బంటు, యుగా తులసి పార్టీ నుంచి రాజా భార్గవ్ కర్నాటి, ఏలియన్స్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ సంక్రాంతి రాజశేఖర్, లు తోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా గుండ్రెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా రవి, అంజయ్య తండు, ధనావత్ ఉషా నాయక్, పగడాల ఎల్లయ్య, పగిడి రామలింగయ్య, బరపాటి రాజశేఖర్ , బారెడ్డి లక్ష్మారెడ్డి, బోల్లసాని కృష్ణయ్య, మల్లిడి వెంకట రామారెడ్డి,మట్టపల్లి అంకలమ్మ, మహేశ్వరం చిరంజీవి, మంగదుట్ల లింగయ్య,సయ్యద్ ఫరుక్, సైదా లా, సందీప్ లు స్వతంత్రులుగా బరిలో ఉన్నారు వీరి యొక్క నామినేషన్లకు ఆర్డీవో ఆమోదం తెలిపారు. విత్ డ్రా లు ఈ నెల 15 వరకు ఉన్నది. ఈ లోపు ఎంత మంది అభ్యర్థులు పోటీలో ఉంటారనేది 15వ తేదీ ఫైనల్ అవుతున్నది.

post bottom

Leave A Reply

Your email address will not be published.