నేడు నామినేషన్ వేయనున్న జూలకంటి రంగారెడ్డి
* వేలాది మందితో భారీ ర్యాలీ
* హాజరుకానున్న మాజీ ఎంపీ మధు
మిర్యాలగూడ ప్రజాలహరి
మిర్యాలగూడ నియోజకవర్గ సిపిఐ ఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి నేడు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేస్తున్న సందర్భంగా హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఈ ర్యాలీకి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిమందిని జన సమీకరణ చేయనున్నారు. ఈ నామినేషన్ల పర్వానికి మాజీ ఎంపీ మధు హాజరుకానున్నారు. ఎర్రజెండాలు ఎర్ర చీరలు టీ షర్టులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజులేని పోరాటాలు చేస్తున్న జూలకంటి రంగారెడ్డి నామినేషన్ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.