బిఎల్ఆర్ అభిమానులతో *జనసంద్రమైన మిర్యాలగూడ. ప్రజాలహరి… తడారి నా భూమిపై వర్షపు చుక్కలు పడితే ఎంత ఆనందం ఉంటుందో ఈరోజు బిఎల్ఆర్ జన సముద్ర ర్యాలీని చూస్తే అర్థమవుతుంది. గత 20 రోజులుగా టికెట్లపై అందరి గోళం కు ఈరోజు బిఎల్ఆర్ నామినేషన్ తో పటాపంచలైంది. కార్యకర్తలు నాయకులు బయటకు వచ్చారు. పొత్తులు ఇక్కట్లతో సతమవుతున్న మిర్యాలగూడ కాంగ్రెస్ కు బిఎల్ఆర్ ఒక వరం అని ఈరోజు ఆయన నామినేషన్ల యాత్రకు వచ్చిన జనమే సాక్షిభూతo… కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు టికెట్ల లొల్లి ఉంటుంది .అది చివరిదాకా తేలదు. ఆ సందర్భంలో కార్యకర్తలను ధైర్య వచనాలు చెప్పుకుంటూ వారికి హితబోధలు చేసుకుంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని సూచనలు చేస్తూ గుండె నిబ్బరంతో బిఎల్ఆర్ ఉండటం చాలా సంతోషదాయకం ఆయన గురువారం నామినేషన్ వేయడానికి పిలుపును ఇవ్వడంతో ప్రజలు తండోపతండాలుగా బయలుదేరారు.. మామూలుగా నాయకులు పట్టణ ప్రాంతాల్లో సభ ర్యాలీ నిర్వహించి సభను ఉద్దేశించి ప్రసంగించడంతోనే నామినేషన్ కార్యక్రమం ముగుస్తుంది. కానీ బి ఎల్ ఆర్ నాగార్జునసాగర్ హైవేపై తుంగపాడు గ్రామ దళిత బిడ్డ షెడ్యూల్ కులాలకు చెందిన సర్పంచ్ శ్రీమతి మచ్చ మాసమ్మ ఇంటి నుంచి తన నామినేషన్ ర్యాలీని ప్రారంభించారు. వారు వారి ఇంటికి వెళ్లి వారిచే మంగళ నీరాజనాలు అందుకొని నుదుట కుంకుమ దిద్దుకుని వారి ఇంటి వద్దనే నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేసి వారి ఎదుర్కోళ్లతో తన ప్రజా యాత్రను ప్రారంభించారు. సుమారు ఆ ఆరు కిలోమీటర్ల మేర రహదారులు మొత్తం కాంగ్రెస్ జెండా రెపలతో నిండిపోయింది. నాగార్జునసాగర్ హైవే మీద గంటలకు తరబడి ట్రాఫిక్ జామ్ అయింది. కార్యకర్తల ఆనంద ఉత్సవాల్లో ఆయన తన పాదయాత్రను కొనసాగిస్తూ స్థానిక రాజీవ్ చౌక్ వద్ద చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్డిఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ పత్రాలు ఆర్డీవో చెన్నయ్యకు సమర్పించారు. ఆయనతోపాటు ఆయన ధర్మపత్ని మాధవి కూడా నామినేషన్లు వేశారు.. ఈరోజునేల ఈనిందా… ఆకాశానికి చిల్లు పడిందా.. అన్న చందంగా ఇసుకవేస్తే రాలని జనసంద్రంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి నామినేషన్ పర్వం పరుగులు పెట్టింది. మిర్యాలగూడ కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న తుంగపాడు గ్రామం నుండి మొదలైన బిఎల్ఆర్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి గ్రామ గ్రామాన పార్టీ కార్యకర్తలు అభిమానులు అనుచరులు పెద్ద ఎత్తున పోటెత్తారు. అశేష జనవాహిని తో ప్రధాన రహదారి సాగర్ రోడ్డు నిండిపోయింది. ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద నిలబడే స్థలం లేక రైల్వే ట్రాక్ వద్ద భారీ సంఖ్యలో చేరిన కార్యకర్తలతో మహిళలు వృద్దులు యువకులు ఇలా తరతమ బేధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు బిఎల్ఆర్ వెంట కదం తొక్కి కదిలారు. మిర్యాలగూడ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే రికార్డ్ సృష్టించే విధంగా వేలాది మందితో కోలాహలంగా కొనసాగిన బి ఎల్ ఆర్ నామినేషన్ ర్యాలీని ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఆసక్తితో వీక్షించాయి..*