నామినేషన్ వేసిన భాస్కర్ రావు…
మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు గురువారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం తన నామినేషన్లు వేశారు.. ఆర్డిఓ చెన్నయ్య కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే భాస్కరరావు గురువారం 9 సంఖ్య మంచిది కావడం చేత ముందుగా ఆయన సతీమణి మంగళహారతులతో నుదుట తిలకం దిద్ది నామినేషన్ వేసి విజయకేతనంతో ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లాలని దీవించారు. అనంతరం మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ రైతు సమితి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు సిద్ధార్థ మరియు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ముఖ్య నాయకులతో స్వగృహం నుంచి ర్యాలీగా అమరవీరుల స్థూపం దగ్గరికి చేరుకున్నారు. అక్కడ అమరవీరులకు నివాళులర్పిస్తూ ఎందరో అమరులు త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. అటువంటి తెలంగాణను స్వార్ధపరులు చేతుల్లో పెట్టవద్దని పిలుపునిచ్చారు .అక్కడి నుంచి భారీ ఎత్తున ప్రజా ప్రదర్శనతో స్థానిక రాజీవ్ చౌక్ మీదుగా రెవిన్యూ డివిజనల్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్య నాయకులతో కలిసి కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజల ఉద్దేశించి మాట్లాడుతూ మిర్యాలగూడను నవ్య నాగరికత వైపు తీసుకువెళ్లిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్ని అటువంటి కేసీఆర్ను తనను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు.