పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. కిసాన్ సెల్ జిల్లాఅధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి
వేములపల్లి నవంబర్ 8.. ప్రజాలహరి..
అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో రైతు బొంగర్ల ఎల్లయ్య సాగుచేసిన వరి పంట పొలం వర్షానికి నేలవాలిన పంట పొలాన్ని పరిశీలించి మాట్లాడారు. రైతులుఆరుగాలాలు కష్టించి పండించిన పంట తీరా చేతికొచ్చే సమయానికి ధాన్యం తడిచిపోయిందని ప్రభుత్వము రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల చేత పంట నష్టాన్ని అంచనా వేయించి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించినష్టపరిహారం అందేలా చూడాలన్నారు.కార్యక్రమంలో ఆయన వెంట టిపిసిసి మెంబర్ చిరుమరి కృష్ణయ్య, మండల పార్టీ అధ్యక్షుడు మాలికాంతారెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకొప్పల సైదులు, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సత్తిరెడ్డి, బొంగర్ల వినోద్,గిరి, నాగేష్