మిర్యాలగూడ ప్రజాలహరి……*”గత పదేళ్ళుగా పట్టణాభివృద్ధి కోసమే పని చేసానని, ఇకముందు కూడా కొనసాగాలనే నా తపనంతా” అని మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.*
బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని, 42, 44, 48 వార్డుల పరిధిలోగల సీతారాంపురం ఏరియాల్లో ప్రగతియాత్ర నిర్వహించారు.
తొలుత గణేష్ మార్కెట్ లో గల శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేసారు.
అనంతరం పలు వార్డుల పరిధిలోని సీతారాంపురం ప్రజలు స్వచ్ఛందంగా కదలి వచ్చారు.పూలమాలలు వేసి అపూర్వంగా స్వాగతించారు.పలువురు మహిళలు మంగళహారులతో ఆశీర్వదించారు. మహిళా కోలాట బృందం ఉత్సాహంగా ముందుకు సాగారు. యువకులు బిఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద జెండాలను చేబూని ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల వారికి సహాయం అందించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలను తప్పకుండా అమలు చేసి సబ్బండ వర్గాలను ఆదుకుంటామని తెలిపారు.
*ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు.*