ప్రజాలహరి మిర్యాలగూడ
..*బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతీ కుటుంబానికి కెసిఆర్ బీమా ద్వారా రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తామని మిర్యాలగూడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.*
మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు, విద్యానగర్, ఈదులగూడ, రాంనగర్ బంధం, ఇందిరమ్మ కాలనీ, అగ్రిగోల్డ్ కాలనీ, సుభాష్ నగర్, వివేకానందనగర్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతి యాత్ర నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని యువకులు, మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. డప్పువాయిద్యాలు, మహిళా కోలాట బృందాలు స్వాగతం పలుకగా, పలువురు పూలమాలలు వేసి అభినందనలు తెలియజేసారు. హౌసింగ్ బోర్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు.రానున్నది మళ్ళి కెసిఆర్ ప్రభుత్వమేనని, సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికీ అందించే విధంగా కృషి చేసానన్నారు. వేగంగా జరుగుతున్న పట్టణాభివృద్ధి కొనసాగేందుకు తనను మరోసారి గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటేయాలని, సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.