Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడను అభివృద్ధి చేశాను అది చూసి నన్ను గెలిపించాలి రంగారెడ్డి

Post top
home side top

ప్రజల గొంతుక కమ్యూనిస్టులను గెలిపించాలి

*అందరివాడిలా మిర్యాలగూడ గౌరవాన్ని పెంచుతా..

* మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు కృషి

*ధన, సేవ బలం మధ్యనే ఎన్నికలు

*జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తా

*9 న నామినేషన్ దాఖలు

మిర్యాలగూడ ప్రజాలహరి…

 

ప్రజల గొంతుకైనా కమ్యూనిస్టులను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై రాజులేని పోరాటాలు నిర్వహిస్తున్నామని అందరివాడిగా పనిచేస్తానని చెప్పారు ధన, సేవా బలం మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయని నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండి నిజమైన ప్రజా సేవకులకు ఓటేసి గెలిపించాలని కోరారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ వాహనాలలోనే మధ్యాన్ని తరలించి నిలువ చేసినట్లు ఆరోపించారు. ప్రతిరోజు కుల సంఘాలను, ఇతర సంఘాలను సమావేశాలు జరిపి దావతులిస్తూ ఎన్నికల కోడ్ ను ఉల్లంగిస్తున్నారని విమర్శించారు. కొందరు నాయకులు డబ్బును నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఆలోచించి ఓటు వేసి భవిష్యత్తును కాపాడుకోవాలని కోరారు. నియోజకవర్గా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన మిర్యాలగూడ జిల్లా ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అందరివాడిలా అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం పని చేస్తారని చెప్పారు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మిర్యాలగూడ ప్రాంత ప్రజల గౌరవాన్ని ప్రతిష్టను పెంచే విధంగా కృషి చేశానని గుర్తు చేశారు. నిత్యం 16 గంటలకు పైగా ప్రజల కోసం పనిచేసే తనకు మరోసారి అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపించాలని రైతులు కార్మికులు నిరుద్యోగులు మహిళలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై గొంతుకతో ప్రశ్నించి పోరాటం చేస్తానని చెప్పారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇప్పించడంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని మిర్యాలగూడలో జర్నలిస్టులు లక్షల ఖర్చు పెట్టి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు తాను గెలిచిన వెంటనే జర్నలిస్టులకు 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడంతోపాటు ఇళ్ల నిర్మాణం కోసం పది లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేసే విదంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.నిధులు,నీళ్లు,నియామకాల సాధించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రలోభాలకు గురిచేసే అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 45 సంవత్సరాలుగా రాజకీయంగా ఉన్నానని, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నని తెలిపారు. కలిసొచ్చే వారిని, పార్టీలను కలుపుకొని పోయి ఎన్నికలోకి పోతామని చెప్పారు. రాష్ట్రంలో 14 మంది అభ్యర్థులను ప్రకటించామని, మరో 3,4 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ను ఎంపిక చేస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో మరి కొన్ని చోట్ల పోటీ చేస్తామని, వారి పేర్లను త్వరలో ప్రకటిస్తామన్నారు.ఈ నెల 9 న నామినేషన్ వేస్తామని, దీనికి నియోజకవర్గ పరిధిలో వేలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, నూకల జగదీష్ చంద్ర, సత్యనారాయణ రావు, తిరుపతి రామ్మూర్తి, వరలక్ష్మి, చౌగాని సీతారాములు, కె.రమేష్, పాపి రెడ్డి, సైదులు, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, ఖాజా మొయినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.