మిర్యాలగూడ ప్రజాలహరి
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించాలని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మిర్యాలగూడ మండలంలోని జప్తిరప్పగూడెం, భల్లునాయక్ తండ, సిత్యతండ, అన్నారం,జటావత్ తండ, ధీరావత్ తండ, కొత్త సామ్యతండ, సామ్యతండ, తుంగపహాడ్, లావూడి తండ, గోగువారిగూడెం తదితర గ్రామాల్లో ప్రగతి యాత్ర జరిగింది. ఆయా గ్రామాల్లోని వీధుల్లో ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుసుకుని,బిఆర్ఎస్ మేనిఫెస్టో, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి కరపత్రాల పంపిణీ చేసారు. వివిధ గ్రామాల్లో మహిళలు కోలాట బృందం, డప్పు కళా బృందం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు మాట్లాడుతూ రైతు భీమా తరహాలోనే ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నామని, తెల్లకార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నా మని, రూ.400 లకే గ్యాస్ సిలిండర్, ఆసరా పెన్షన్ పెంపుదల, రైతుబంధు పెంపుదల తదితర పథకాల అమలు చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ మండల వ్యాప్తంగా రూ. 704 కోట్లతో అభివృద్ధి పనులు చేసామని, సంక్షేమ పథకాల అమల కోసం రూ 684 కోట్ల 58 లక్షల రూపాయలు పంపిణీ చేసామని వివరించారు.తాను గత పదేళ్లుగా అభివృది పనులు, సంక్షేమ పథకాలు అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అహర్నిషలు కృషి చేస్తున్నానన్నారు. సమగ్రాభివృద్ధి కోసం తనను మూడోసారి గెలిపించేందుకు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటెయ్యాలని ప్రజలను కోరారు.