Ultimate magazine theme for WordPress.

ముడుంబై రామానుజాచార్యులు మన మధ్య లేరు

Post top

ముడుంబై రామానుజాచార్యులు మన మధ్యన ఇకలేరు…. గుండెపోటుతో మృతి…. మిర్యాలగూడ ప్రజాలహరి…. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవ కర్త , ఆదర్శప్రాయుడు తాను చేసే వృత్తి పట్ల అంకితభావం కలిగిన ముడుంబై రామానుజ చార్యులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు .ఆయన మరణ వార్త మిర్యాలగూడ పట్టణంలోని పలువురిని కలిచి వేసింది. జననం మరణం అనేది క్షణకాల గడియ ఈ సందర్భంలో మానవుడి యొక్క పుట్టుకను వ్యక్తిత్వాన్ని చాటి చెప్పేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. అందులో కొందరు మాత్రమే మహనీయులుగా ఆదర్శ పురుషులుగా కొనియాడ పడతారు. మన ముడుంబై రామానుజాచార్యులు ప్రథమ వరసలో ఉంటారు. ఆయన మిర్యాలగూడ పట్టణ ప్రజలకు సుపరిచితులు. ఆయన ఉపాధ్యాయుడు కూడా విద్యార్థులకు సత్య బోధన, సేవా మార్గాలు గురించి ఉపదేశించేవారు. అటు వృత్తిలోనూ అటు సంఘ సేవలో కూడా పాల్గొనేవారు. మిర్యాలగూడ ప్రజలకు పట్టణ అభివృద్ధికి ఇవి చేస్తే బాగా ఉంటుందని ప్రజా ప్రతినిధులకు సూచనలు చేసే వారు ఆ ప్రజా ప్రతినిధులు కూడా ఆయన సత్యనిష్టకు సంతోషపడుతూ ఆయన సూచనలు పాటిస్తూ మిర్యాలగూడను అభివృద్ధి తీసుకు వెళుతుండేవారు. ఆయన కు వచ్చే వేతనంలో 25 నుంచి 50 శాతం వరకు జీతాన్ని సేవా కార్యక్రమాలకు ఉపయోగించేవారు. మిర్యాలగూడలో లయన్స్ క్లబ్  స్థాపనలో ఆయన పాత్ర మరువలేనిది .ఆ సంస్థను స్థాపన చేయించి పలువురు ప్రముఖులను భాగస్వామ్యం చేస్తూ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు .ఆయన సేవా కార్యక్రమాలు మచ్చుకు ఒక ఉదాహరణ మిర్యాలగూడ పట్టణంలోని రామచంద్ర గూడెం ప్రధాన రహదారికి ఆనుకోని ఉండే వారి యొక్క సోదరులు టీవీ కే రాఘవాచార్యులు రంగనాయకమ్మ గార్లకు సంబంధించిన విలువైన భూమిని మిర్యాలగూడ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రికి భూదానంగా ఇప్పించడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఇప్పటికీ లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి లో నిత్యము కంటి వైద్య పరీక్షలు జరుగుతున్నాయిని అంటే ఆయన పాత్ర ప్రముఖము అని చెప్పాలి. రాజకీయ ఉద్దండలకు సహచర మిత్రుడు…. మిర్యాలగూడ ప్రజాప్రతినిధులు విద్యావేత్తలకు ఆయన సహజర మిత్రుడు కుందూరు జానారెడ్డి, ఒకప్పటి ఎండిఓ భావనచార్యులు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి తో పాటు మిర్యాలగూడ ప్రముఖులు ఆయన సహచర మిత్రులు…. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతుంటే అనేకం. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన సేవలకు గాను జాతీయ ఉత్తమ  ఉపాధ్యాయ అవార్డు దక్కింది. ఆయనకు ఈధర్ కుమార్తెలు వారి ధర్మపత్ని టెలికo ఉద్యోగి

 

post bottom

Leave A Reply

Your email address will not be published.