
అధికారం లోకి రావాలని కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు
*నాన్చుడి ధోరణి నచ్చకనే ఒంటరి పోరు
*సీపీఎం, సీపీఐ కలిసి 40 స్థానాల్లో పోటీ
*వామపక్ష అభ్యర్థులను గెలిపించాలి
* బిఆర్ఎస్ బిజెపి పార్టీలను ఓడించాలి
* చట్టసభల్లో వామపక్షాల అవసరo
* సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
- మిర్యాలగూడ ప్రజాలహరి…
అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇష్టం లేదని, అందుకే పొత్తుల విషయంలో నాన్చుడి ధోరణి అవలంబిస్తుందని, అందుకే ఒంటరిగా పోటీ చేసేందుకు నిర్ణయించమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని టిఎన్ఆర్ గార్డెన్లో సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాష్ట్ర రాజకీయాలలో కమ్యూనిస్టు పార్టీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు ఎన్నికల్లో బిజెపి టిఆర్ఎస్ పార్టీలను ఓడించాలని లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. ఇండియా కూటమిలో ఉండి మతోన్మాద, అవకాశవాద రాజకీయ పార్టీలను ఓడించాలని ప్రజా ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో కలిసి రావాలని కాంగ్రెస్ పార్టీ తమతో సంప్రదింపులు జరిపిందని సీట్ల సర్దుబాటు విషయంలో కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు ఒప్పుకున్న రెండు సీట్లు కూడా ఇవ్వకుండా జాప్యం చేయడంతో ఒంటరిగా పోటీ చేసేందుకు రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు. పొత్తు కాకుండా చేసిన కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అన్నారు. దేశంలో బిజెపి రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దించాలంటే కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించాలని చెప్పారు అలాంటప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అధికారంలోకి రావాలని చిత్తశుద్ధి ఉంటే అందరిని కలుపుకుపోయే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. కొందరు కమ్యూనిస్టు పార్టీలపై అవమానకరంగా మాట్లాడుతున్నారని అలా మాట్లాడితే భవిష్యత్తులో ఊరుకోబోమని హెచ్చరించారు. పూటకో పార్టీలు మారుతూ నిలకడ లేని వాగ్దానాలు చేసే నాయకులకు కమ్యూనిస్టు పార్టీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ నాన్చుడి ధోరణి వలన ఒంటరిగా పోటీ చేసేందుకు నిర్ణయించామన్నారు ఇప్పటికే 17 స్థానాలను గుర్తించామని ఇంకా మూడు స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సిపిఐ పార్టీ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నామని ఇరు పార్టీలు కలిసి రాష్ట్రంలో సుమారు 40 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పారు. చట్ట సభల్లో వామపక్షాలు అవసరం ఉందని, ప్రజలు గుర్తించి ఓటు వేయాలన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల దేవాలయాల్లో పూజలు లేనట్టుగా ఉన్నాయని కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించుకున్నట్లయితే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యకర్తలు నాయకులు సహాయశక్తుల కృషిచేసి వామపక్షాల అభ్యర్థుల గెలుపుకు పాటుపడలన్నారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడే వామపక్షాలను ఎన్నికల్లో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు జరిపే పార్టీలు కేవలం వామపక్షాలేనని చెప్పారు. దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్న వారి విధానాలు మారడం లేదని ఏ ప్రభుత్వాలు కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం తాత్కాలిక పథకాలు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. పేదల పక్షాన ప్రజా సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వినిపించే వామపక్షాలను ఈ ఎన్నికల్లో గెలిపించి ప్రజలు అండగా నిలవాలని కోరారు. దేశంలో బీజేపీ ప్రమాదకర పార్టీగా మారిందని రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని అలాంటి పార్టీలను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ,సూర్యాపేట జిల్లా కార్యదర్శలు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, మల్లు నాగార్జున రెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, లక్ష్మినారాయణ, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, మహమ్మద్ హషo, డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్ చంద్ర, రవి నాయక్, భవాండ్ల పాండు రాగిరెడ్డి మంగా రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, పరుశురాములు, వరలక్ష్మి, వినోద్ నాయక్, ఎండి అంజాద్, గాదె పద్మ తదితరులు పాల్గొన్నారు.