సొంతంగానే పోటీ చేస్తాం లెఫ్ట్ పార్టీలు…
ప్రజాలహరి హైదరాబాద్… కాంగ్రెస్ పార్టీతో పొత్తులు లేవని లెఫ్ట్ పార్టీల నాయకులు నారాయణ, వీరభద్రం, చాడ వెంకటరెడ్డి, జూలకంటి రంగారెడ్డి తోపాటు పలువురు నాయకులు ఈరోజు సమావేశం అయ్యారు కాంగ్రెస్ పార్టీ తో లెఫ్ట్ పార్టీలకు పోత్తులు ఉండవని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సిపిఎం 17 చోట్ల పోటీకి రంగంలో ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు భద్రాచలం మిర్యాలగూడ హుజూర్నగర్ జనగాం ముషీరాబాద్ పటాన్చెరు ఇబ్రహీంపట్నం అశ్వరావుపేట పాలేరు మధిర వైరా సత్తుపల్లి నలగొండ నకిరేకల్ బోనగిరి కోదాడ ఇబ్రహీంపట్నం లో పోటీలో ఉంటున్న పేర్కొన్నారు. అభ్యర్థులను రేపు ప్రకటిస్తామని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు సిపిఎం బాటలోనే సిపిఐ కూడా ఉన్నది రేపు సాయంత్రం సిపిఐ కూడా తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.