Ultimate magazine theme for WordPress.

దళితులకు ఎమోషన్స్ లేవా వారిని చినచూపు చూడాలా… కేసీఆర్

Post top
home side top

వాళ్లకు ఎమోషన్స్‌ లేవా? ప్రేమలు లేవా? ఎందుకింత అన్యాయం: సీఎం కేసీఆర్‌

మిర్యాలగూడ ప్రజాలహరి..

ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న వారిని గెలిపించి ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మిర్యాలగూడ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘నేను చెప్పేమాటలను దళితబిడ్డలు, దళిత మేధావులు ఆలోచన చేయాలి. యుగయుగాలు, తరతరాలుగా దళితజాతి అణచివేతకు గురవుతున్నది. ఇంకెన్ని యుగాలు అలా ఉండాలి. ఎందుకు ఉండాలి. వాళ్లు మనతోటి మనుషులు కారా? గౌరవంగా బతకాలని కోరికలు లేవా? వాళ్లకు ఎమోషన్స్‌ లేవా? ప్రేమలు లేవా? ఎందుకింత అన్యాయం.

#ఆ జాతికి జరగాలి ? కాంగ్రెస్‌ స్వతంత్రం వచ్చిన నాడే వెనుకబడ్డ జాతులు ఏవీ.. మూడునాలుగు నిమన్న కులాలేవి అని గుర్తించి.. వారి కోసం స్పెషల్‌ గ్రోత్‌ ఇంజిన్‌ పెట్టి ప్రత్యేక అభివృద్ధి చేసే కార్యక్రమాలు పెట్టి ఉంటే.. వాళ్ల దరిద్రం తీరకపోవునా? దేశంలో ఏ నాయకుడు చేయలేదు. ఏ ప్రభుత్వం చేయలేదు. దళితబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్‌. ఎవడూ చేయలేదు. ఒకటే రోజు చేయకపోవచ్చు.. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అంత లేకపోవచ్చు. కానీ ఆ నినాదం వస్తే.. వారిలో ఆత్మవిశ్వాసం రావాలి.. దఫాల వారీగా అయినా సరేనని కంకణం కొట్టుకొని ఇంటికి రూ.10లక్షలు ఇచ్చేలా దళితబంధు కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. దళిత సమాజం ఆలోచన చేయాలి. ఇలా చేసే వారిని ప్రోత్సహించాలి.. గెలిపించాలి’ అని పిలుపునిచ్చారు.

 

#అప్పుడు గవర్నమెంట్‌ వారికే సపోర్టు చేస్తుండే..

‘ఒరవడిలోపడి కొట్టుకుపోవద్దు. గెలిపిస్తే ఇంకా చేయాలని అనిపిస్తుంది. గతంలో బ్యాంకుల్లో అప్పులుంటే.. బ్యాంకుల వాళ్లు తలుపులు తీసుకొని పోతుండే. గవర్నమెంట్‌ కూడా వారికి సపోర్టు చేస్తుండే. కానీ రైతు పరిస్థితి మెరుగుపరచాలని ఎన్నడూ ఏ పార్టీ ప్రభుత్వం ఆలోచించలే. తెలంగాణ వచ్చాక తీవ్రమైన సమీక్ష జరిపి.. ఏ రంగం నుంచి పని మొదలు కావాలి? మన పునాది ఎక్కడ పడాలి ? గ్రామాలు, పల్లెలు ఎట్లా కళకళలాడాలి ? పచ్చదనం ఎట్లా ఉండాలని ఒక్కొక్క కార్యక్రమాలు నిర్ణయించాం. ఆడబిడ్డల గోస తీరాలని, దూప తీరాలని మిషన్‌ భగరీథ ద్వారా శుద్ధమైన మంచినీళ్లు తెచ్చుకున్నాం. కరెంటు బాధను శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఈ జిల్లాకు చెందిన కరెంటు మంత్రి జగదీశ్‌రెడ్డి, భాస్కర్‌రావు ముందుకువచ్చి దామరచర్లను చూపించడంతో రూ.30వేలకోట్లతో అల్ట్రామెగా పవర్‌ప్లాంట్ రూపుదిద్దుకుంటున్నది. ఈసారి భాస్కర్‌రావును లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే భాస్కర్‌రావు కోరిన కోర్కెలు నెరవేరుస్తా. అక్కడి నిరుద్యోగులకు పవర్‌ప్లాంట్‌లో ఉద్యోగాలు వచ్చేలా చేయిస్తా. మంచిపనులు కోసం తపించే.. మంచి నాయకుడు ఎప్పుడు ఉన్నా వారిని గెలిపించే ప్రయత్నం జరగాలి’ అన్నారు.

 

#ప్రయాణం ఇలాగే కొనసాగితే మంచిది..

‘ఇవాళ సమస్యలన్నీ ఒకటి తర్వాత ఒకటి తీర్చుకుంటున్నాం. ముందుకెళ్తున్నాం. ఒక రాష్ట్రం, ఒక దేశం బాగుపడ్డదా? లేదా? అని తెలుసుకునేందుకు కొన్ని గీటురాళ్లు ఉంటాయ్‌. అంతర్జాతీయ ప్రామాణికతలు ఉంటాయి. ఏ రాష్ట్రం బాగుపడ్డదా లేదా? అని చూసేందుకు గీటురాయి ఆ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ? తలసరి విద్యుత్‌ వినియోగం ఎంత? అని చూస్తారు. రాష్ట్రం ఏర్పడ్డనాడు తలసరి ఆదాయం లక్షలోపు ఉండే. మనస్థానంలో దేశంలో అప్పుడు 15వ స్థానంలో ఉండే. 70 సంవత్సరాల నుంచి మనకన్నా పెద్ద రాష్ట్రాలున్నాయి. కేవలం పది సంవత్సరాల చిన్న వయసున్న తెలంగాణ ఈ రోజు తలసరి ఆదాయంలో నెంబర్‌ వన్‌ అని గర్వంగా తెలుపుతున్నా. తలసరి విద్యుత్‌ వినియోగంలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. మంచినీళ్ల సరఫరాలో నెంబర్‌ వన్‌గా ఉన్నాం. సాగునీళ్ల బాధ తీరబోతున్నది. రాబోయే రెండేళ్లలో తీరిపోతుంది. పేదలు, నిరుపేదలు, రైతాంగాన్ని వెంబడేసుకొని కొనసాగుతున్న ముందుకెళ్తున్న ఈ ప్రయాణం ఇదేవిధంగా కొనసాగితే మంచిది. వేరేవాళ్లు వస్తే డిస్టబెన్స్‌ వస్తుంది. వాళ్ల వైఖరి, ఆలోచన సరళి మీకు తెలుసు’అని అన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.