నల్లమోతు భాస్కరరావు తోనే అభివృద్ధి సాధ్యం ముఖ్యమంత్రి కేసీఆర్…..
మిర్యాలగూడ ప్రజాలహరి..అనునిత్యం అభివృద్ధి కోసం పాటుపడే భాస్కరరావు గెలుపుతోనే మిర్యాలగూడ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మిర్యాలగూడలో ఎస్పీ క్యాంపు గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా మిర్యాలగూడ రాష్ట్రానికే తలమానికమని నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు అధికంగా ఉన్న ఈ ప్రాంతానికి రెండు పంటలు నీటి సమస్య అనేది లేకుండా అతివృష్టి, అనావృష్టి ఎటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనే విధంగా కాలేశ్వరాన్ని మిర్యాలగూడ (పెద్దదేవలపల్లి.) కూడా తీసుకొస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మనల్ని పాలించే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నిజాయితీపరులైతేనే ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రంగానే అభివృద్ధి పనుల్లో పయనిస్తుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన రోజుల్లో ఎన్నో కష్టాలను దాటుకుంటూ అభివృద్ధి కోసం పనిచేసి రాష్ట్రo ను తలసరి ఆదాయంలో తెలంగాణను అగ్రగామిగా ఉంచానని అదేవిధంగా మిర్యాలగూడను భాస్కరరావు అగ్రగామిగా ఉంచారని చెప్పారు. భాస్కర్ రావు నిత్య అభివృద్ధి కారకుడు …..ప్రభుత్వo నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో భాస్కర్ రావు మాకు కుడి భుజంలా ఉంటాడని ఆయన ఏనాడు వ్యక్తిగత పనులను తన దృష్టికి తీసుకు రాలేదని చెప్పారు. నిత్యం తుంగపాడు ముసి నదులపై ఎత్తిపోతల పథకాల గురించి కోరుతూ ఉంటాడని వివరించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం విశేషంగా కృషి చేసిన భాస్కరరావు 4400 మెగావాట్ల అల్ట్రా హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా భాస్కరరావుతోపాటు జగదీశ్వర్ రెడ్డి తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారని భాస్కరరావు యాదాద్రి పవర్ ప్లాంట్ కావాల్సిన నీటి వనరులు భూమి వివరాలను తన ముందుంచి ఈ ప్రాంతంలో అయితే దక్షిణ తెలంగాణ మొత్తం అభివృద్ధి చేయొచ్చని సూచనలు చేశారని ఆయన ప్లాంట్ ఏర్పాటు కోసం ఎంతో తపించారని నాకు అర్థమైందని ఆయన కోరిక మేరకు 30 వేల కోట్ల రూపాయలతో యాదాద్రి పవర్ ప్లాంట్ ను తుంగపాడు వాగు సమీపంలో వీర్లపాలెం లో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. కాలువ చివరి భూముల కోసం నీటి లభ్యతపై ఉద్యమం ఈ ప్రాంతం నుంచి జరిగిందని ఈ ఉద్యమానికి అప్పటి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విజయసింహారెడ్డి నేతృత్వంలో 70 వేల మందితో సాగర్ ప్రాజెక్టును ముట్టడించానని చివరి భూములకు నీళ్లు ఇవ్వకపోతే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించడంతో మరుసటి రోజు నీటి విడుదల చేశారని కెసిఆర్ చెప్పారు. రైతుల బాధలు తనకు తెలుసునని రానున్న రోజులు గడ్డు కాలంగా ఉంటుందని పరిస్థితిలో దృష్టిలో పెట్టుకొని గోదావరి జలాలను సాగర్ ఆయకట్టుకు అందించే కృషి చేస్తానని చెప్పారు. ప్రతిపక్షాలు టిఆర్ఎస్ గెలుపును జీర్ణించుకోలేక ముందుగానే తమ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి పై కత్తులతో దాడి చేశారని ఇటువంటి ఇటువంటిచర్యలను సమర్థించనని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. భాస్కర్ రావు గారు కేసీఆర్ కళాభారతి భవనాన్ని చూపించారని మిర్యాలగూడ కుఆ భవనం కిరీటం గా ఉంటుందని చెప్పారు. తనకు కులము, మతము, ప్రాంతం భేదాలు లేవని అందరిని సమదృష్టితో చూస్తానని చెప్పారు. మైనార్టీల కోసం ఉర్దూలో ప్రసంగించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుమారు 6000కోట్లతో అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. మిర్యాలగూడ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని విధాలుగా సహకరించారని పేర్కొన్నారు. నిధులు అడిగిన వెంటనే పలు రూపకాల్లో ప్రకటించి విడుదల చేశారని ఆయన సహకారంతో మిర్యాలగూడ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. తక్కెళ్ళపాడు వద్ద తక్కెళ్ళపాడు- మైనం వారి గూడెం శివారులో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయించినట్లయితే సుమారు 1000 ఎకరాల భూమి అదనంగా సాగులోకి వస్తుందని పేర్కొన్నారు. మిర్యాలగూడ కు అదనంగా వంద పడకల ఆసుపత్రికి ముఖ్యమంత్రి మంజూరు చేశారని అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ లో స్థానికులకు భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వము సహకరించాలని కోరారు. మిర్యాలగూడ పారిశ్రామిక ప్రాంతం కావడం చేత ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ, ఒక పాలిటెక్నిక్ అగ్రికల్చర్ కాలేజీ మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ మరియు నియోజకవర్గంలో రహదారులు ఇతర అభివృద్ధి నిమిత్తం 300 కోట్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి భాస్కరరావు కోరారు….. భాస్కర్ రావు ను లక్ష మెజార్టీతో గెలిపించాలి……
అశేష జన సమ్మోహనాన్ని చూసిన తర్వాత భాస్కరరావు లక్ష మెజారిటీతో గెలుస్తాడని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజలు కూడా మన ప్రాంతాన్ని మన కోసం పనిచేసే నాయకులను, ప్రభుత్వాన్ని గుర్తించి ఓట్లను ఏకపక్షంగా వేసి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ,మున్సిపల్ చైర్మన్ భార్గవ్ తదితరులు పాల్గొన్నారు